‘‘మనం’’....సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌.

‘‘మనం’’....సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌. | kevkeka.com

మంగళవారం నుండి
 ‘‘మనం’’....సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌.


బుల్లితెర దర్శకుడు ‘అనిల్‌ కడియాల’ దర్శకత్వంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రవీణ కడియాల నిర్మాణ బాధ్యతలతో రూపొందుతున్న సరికొత్త గేమ్‌ షో ‘‘మన ం’’. ‘సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనేది ఉపశీర్షిక. ఎన్నో చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ నటుడు సాయికుమార్‌. హీరోగా, విలన్‌గా, ప్రత్యేక పాత్రలద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సాయికుమార్‌ గతంలోను బుల్లితెరపై కూడా సత్తా చాటారు.  బుల్లితెరపై సాయికుమార్‌ యాంకర్‌గా చేసిన  ‘‘వావ్‌’’ అనే గేమ్‌ షో 250 ఎపిసోడ్లు ఈ టీవీలో ప్రసారం అయ్యింది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. సాయికుమార్‌ కూడా ఉత్తమ వ్యాఖ్యాతగా అదే కార్యక్రమానికి బుల్లితెర నందిని అందుకోవడం విశేషం.  దర్శకుడు అనిల్‌ కడియాల దర్శకత్వంలోనే ఈ ‘వావ్‌’ రూపొందింది. మళ్లీ 7 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కలయికలో ‘‘మనం’’అనే ఒక ఫ్యామిలీ గేమ్‌ షో ద్వారా మన ముందుకు వస్తున్నారు. ఏ గేమ్‌ షో అయినా సెలబ్రిటీస్‌తో ముడిపడి ఉంటుంది.  ఈ ‘మనం’ అనే షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కామన్‌ పీపుల్‌ ఎంటర్‌ అవుతున్నారు. ఈ రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లందరూ ఓ చోటకూర్చుని టైమ్‌ స్పెండ్‌ చేయటం గగనమైపోయింది... అది పరిస్థితుల వల్ల కావచ్చు. సమయం వల్ల కావచ్చు. అందుకే ఆ సమయాన్ని సద్వినియోగం చేయడానికి, రెండు కుటుంబాలు ఒక చోట చేరితే అది పండగలా మారుతుంది అని చూపించడానికి..

చేసే ప్రయత్నమే మా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వస్తున్న ‘మనం’ అని తెలిపారు నిర్మాత ప్రవీణ కడియాల. సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘ ఈ నెల 27 నుండి ...ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రైమ్‌టైమ్‌లో ఈ–టీవీలో
ఈ షో ప్రసారం కాబోతుంది. ప్రేక్షకులు ఆశీర్వదించి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరించాలని కోరుతున్నాము. ఈ ఫ్యామిలీ గేమ్‌ షోలో కుటుంబ అనుబంధాలు, అప్యాయతల గురించి మాట్లాడుకుంటూ, ఆట పాటలతో ఎంజాయ్‌ చేస్తూ లక్షల విలువైన బహుమతులు గెలుచుకుంటూ అందరిని ఎంటర్‌టైన్‌ చేయటమే ఈ ‘మనం’ ప్రత్యేకత అని అన్నారు.

Your Comments

Most Read Telugu Movie News

Advertisement