నెంబ‌ర్ 1 స్టానంలో “నా పేరు సూర్య " ఫస్ట్ ఇంపాక్ట్

 నెంబ‌ర్ 1 స్టానంలో  “నా పేరు సూర్య
 నెంబ‌ర్ 1 స్టానంలో  “నా పేరు సూర్య " ఫస్ట్ ఇంపాక్ట్ 
  
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. ఫ‌స్ట్ ఇంపాక్ట్ జ‌న‌వ‌రి 1న సాయంత్రం 5 గంట‌ల‌కి డిజిట‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన వెంట‌నే చూసిన ప్ర‌తిఓక్క‌రూ ఫ‌స్ట్ ఇంపాక్ట్ పై ప్ర‌శంశ‌ల జ‌ల్లు కురిపించారు. అంతేకాదు సోష‌ల్ మీడియాలో బ‌న్ని సూప‌ర్‌స్ట్రాంగ్ కావ‌టంతో ఈ ఫ‌స్ట్ఇంప‌క్ట్ కి డిజిట‌ల్ గా కొటి వ్యూస్ కేవ‌లం 29 గంట‌ల్లో రావ‌టం విశేషం. గ‌తంలో స‌రైనోడు, డిజె చిత్రాలు కూడా యూట్యూబ్ లో  రికార్డ్ గా నిలిచాయి. స‌రైనోడు ఫాస్ట్ 118 మిలియ‌న్స్ , డిజె చిత్రం నెల రోజుల్లో 84 మిలియ‌న్స్ వ్యూస్ రావ‌టంతో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటో తెలుస్తుంది. 

అదే వూపుతో ఇప్పుడు నాన్ భాహుబ‌లి రికార్డు లో నెంబ‌ర్ 1గా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ‌స్ట్ ఇంపాక్ట్ కి 29 గంట‌ల్లో ఇలాంటి అరుదైన రికార్డు రావ‌టం యూనిట్ స‌భ్యుల్ని, అభిమానులు ఆనందంగా వున్నారు. ఈ చిత్రాన్ని కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో   యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.ముఖ్యంగా ఈ టీజ‌ర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి, మేక్ ఓవ‌ర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నీకు సూర్య సోల్జ‌ర్‌.. కాని  ప్ర‌పంచానికి సూర్య అంటే యాంగర్‌..... అనే ఇంట్రో తో స్టార్ట‌యిన ఈ ఇంపాక్ట్ నిజంగానే అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఇంపాక్ట్ క‌లిగించింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా అల్లు అర్జున్ పాత్ర ని పాత్ర లో లీన‌మైపోయిన న‌టించిన న‌ట‌న టీజ‌ర్ లో ఆక‌ట్టుకుంది. ఏ ముహుర్తాన మెట్ట‌మెద‌టి సారిగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అన్నారో గాని ఈ విజువ‌ల్స్ అంత‌లా ఇంపాక్ట్ క‌లిగించాయి.  ఈ ఇంపాక్ట్ చూస్తే అల్లు అర్జున్ డెడికేష‌న్ , ద‌ర్శ‌కుడు ప‌నితీరు, కెమెరా మెన్ విజువ‌ల్స్ తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. చ‌చ్చిపోతాను కాని ఇక్క‌డ కాదు బోర్డ‌ర్ లో చ‌చ్చిపోతాను అనే డైలాగ్ రోమాలు నిక్క‌బోడుచుకునేలా వుందంటున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. 

స్టైలిష స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ‌స్ట్ ఇంపాక్ట్ కి వ‌చ్చిన రెస్పాన్స్ కి చాలా ఆనందంగా వుంది. అలాగే ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కులంద‌రి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. అని అన్నారు


నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు  
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ    

Your Comments