నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” ఫస్ట్ ఇంపాక్ట్

నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” ఫస్ట్ ఇంపాక్ట్ | kevkeka.com

జనవరి 1 న  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ, “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” ఫస్ట్ ఇంపాక్ట్ 
  
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.  కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో   యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. జనవరి 1 న ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ ఇంపాక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా.  అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రీక‌రిస్తున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ జనవరి 1న రిలీజ్ చేయనున్నాం. అభిమానులకు నూతన సంవత్సర కానుకగా ఈ ఫస్ట్ ఇంపాక్ట్ ఉండనుంది. అని అన్నారు.

చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనం తో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడు. హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. జనవరి 1న రేలీజ్ చేసే ఫస్ట్ ఇంపాక్ట్ తో అభిమానులు పండగ చేసుకుంటారు. తప్పకుండా అద్బుతమైన న్యూ ఇయర్ గిఫ్ట్ అవుతుంది. అని అన్నారు.

సహ  నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. దానికంటే ముందే ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో న్యూ ఇయర్ గిఫ్ట్ తో డబుల్ బొనాంజా అందిస్తున్నాం. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. మరో కీలక మైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు  
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ               

Your Comments

Most Read Telugu Movie News

Advertisement