బేవ‌ర్స్ చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్

న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య పాత్ర లో నటించిన
న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య పాత్ర లో నటించిన " బేవ‌ర్స్ " చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్
 
"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని రెండింత‌లు సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో  S క్రియెష‌న్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్  అర‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.  సునీల్ కాశ్య‌ప్ సంగీతాన్ని అందించారు.  

నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... బేవర్స్ ఏమిటి ఈ టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా... తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు... పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారు... అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో ఎక్కువ పారలల్ సినిమాలు చేసాను. మళ్ళీ ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా వస్తోంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఒక పాటను మ్యూజిక్ డైరెక్టర్ పాడాడు. ఏ ఆర్ రెహమాన్ పాడినట్టు అనిపించింది. హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. ఈ సినిమా నా కెరీర్ లో మరో మంచి చిత్రం గా నిలుస్తుంది. అని అన్నారు.

డైరెక్టర్ రమేష్ చెప్పాలా మాట్లాడుతూ... మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయిత గా ఎంత గా తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. టైటిల్ బేవర్స్ అని ఎందుకు పెట్టామో అనేది తెరమీద చక్కగా చూపించాం. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తాం. అని అన్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు  పొన్నాల చందు, ఎమ్‌. అర‌వింద్ లు మాట్లాడుతూ..  డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు న‌టించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓక‌టి. అలాంటి చిత్రానికి రైట‌ర్ గా ప‌నిచేసిన ర‌మేష్ చెప్పాలా ద‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్ S క్రియెష‌న్స్ పై ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. ఇటీవ‌లే మంచి సాంగ్ షూట్ తో చిత్ర షూటింగ్ పూర్త‌య్యింది. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో సంజోష్‌, హ‌ర్షిత లు హీరోహీరోయిన్స్ గా చాలా బాగా నటించారు ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తాం. అని అన్నారు.

హీరో సంజోష్‌ మాట్లాడుతూ....  నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో పని చేయడం నా అదృష్టం. తండ్రి కొడుకు కలిసి ఈ సినిమా చూడాలి. అని అన్నారు. 

సంగీతం- సునీల్ కాశ్య‌ప్‌, సాహిత్యం- సుద్దాల అశోక్ తేజ్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, మండ్యం అర‌వింద్‌, ఎడిటింగ్‌- ఎం.ఆర్ వ‌ర్మ‌, ఆర్ట్- ర‌ఘు కుల‌క‌ర్ణి, కెమెరా - కె చిట్టిబాబు, ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం-ర‌మేష్ చెప్పాల

Your Comments