సూర్య, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌లో డ్రీమ్‌

సూర్య, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌లో డ్రీమ్‌ | kevkeka.com
సూర్య, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌లో డ్రీమ్‌ వారియర్‌ నిర్మిస్తున్న చిత్రంలో సాయి పల్లవి 
 
సూర్య హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా  నటిస్తుంది. ఈ చిత్రం టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇటీవల 'ఖాకి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సూర్య 36వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. 

Your Comments

Most Read Telugu Movie News

Advertisement