బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట షూటింగ్ పూర్తి.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట షూటింగ్ పూర్తి. | kevkeka.com
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట షూటింగ్ పూర్తి. 
 
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమమట్ట. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లో  రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకుడు. కథ మాటలు కథనం స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్. గీతాంజలి హీరోయిన్స్. సారథి స్టూడియో లో చివరి పాటను చిత్రీకరించారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్బంగా ....

హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.... ఆ ఆ... నుంచి బండి రా వరకు వచ్చే అక్షరాలతో... మంచి పాట పై సాంగ్ షూట్ చేసాం. విజయ్ మాస్టర్ కొరియోగ్రాఫర్. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. నేను ఏమేం చేస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో... అవన్నీ మా రచయిత సాయి రాజేష్ అన్న అద్భుతంగా రాశారు. మగాళ్ల మీద 2 నిమిషాల పాట ఉంది. ఆ డైలాగ్ చాలా బాగా వచ్చింది. అని అన్నారు. 

నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ... 2014 లో హృదయ కాలేయం చేశాం. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో కొబ్బరిమట్ట చేస్తున్నాం. సంపూర్ణేష్ ట్రిపుల్ ఏక్షన్ కావడంతో షూటింగ్ డిలే అయ్యింది. ఈ రోజుతో గుమ్మడికాయ కొట్టేస్తున్నాం. 5 పాటలు టాకీ పూర్తయ్యింది. ఇది ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. సినిమాలో వాళ్ళు ఏడుస్తుంటారు. మీరు నవ్వుతుంటారు. త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు. 

డైరెక్టర్ రోనాల్డ్ మాట్లాడుతూ... విజయ్ మాస్టర్ అద్భుతం గా చేశారు. సంపూ స్టెప్స్ ఆదిరిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చాలా నమ్మకంతో ఉన్నాం. అని అన్నారు. 

సినిమాటోగ్రఫీ - ముజీర్ మాలిక్
మ్యూజిక్ - సయ్యద్ కమ్రాన్
కూర్పు - కార్తీక శ్రీనివాస్
కళ - సుభాష్ , నాని 
ఏక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అలవలపాటి శేఖర్
ఫైట్స్ - స్టంట్ జాషువా
నృత్యాలు - విజయ్.పి, చిరంజీవి, హరి

Your Comments

Most Read Telugu Movie News

Advertisement