పవనిజం డే సెలబ్రేషన్ రోజున పవనిజం-2 సినిమా ప్రారంభం

Guntur Talkies Producer New Movie Pavanijam2 | kevkeka.com
పవనిజం డే సెలబ్రేషన్ రోజున పవనిజం-2 సినిమా ప్రారంభం
 
అక్టోబర్ 11 తారీఖు అనేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి స్పెషల్ డే..ఎందుకంటే పవన్ కళ్యాణ్
నటించిన చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” రిలీజ్ అయిన రోజు..
అందువల్ల గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరు ఆ రోజుని “పవనిజం డే “
గా నామకరణం చేసిసెలబ్రేషన్ చేసుకుంటున్నారు.. ఈ అక్టోబర్ 11 న వరల్డ్ పవనిజం డే
సందర్భంగా R.K.STUDIOS బ్యానర్ పై గుంటూరు టాకీస్ చిత్రాన్ని నిర్మించిన m.రాజ్
కుమార్ గారు పవనిజం -2 అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు...
ఈ చిత్రం లో సాకేత్ రామ్ హీరో గా నటిస్తున్నారు..
సొసైటి మీద ప్రతి ఒక్కరికి భాధ్యత అనేది ఉండాలి, ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఉన్న ఒక
కుర్రాడికి సమాజం లో ఉన్న పరిస్థితులు అతడిని రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేస్తాయి..
అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కొని సమాజం లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు
అనేది ఈ చిత్ర కథాంశం..
ఈ చిత్రానికి కథ,మాటలు,స్క్రీన్ ప్లే డైరెక్షన్ – క్రిష్ణ చేతన్
డి.ఓ.పి – రామిరెడ్డి
కో-ప్రొడ్యూసర్ – రాజశ్రీ .m, .m .సాయిరాజ్ పవన్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజనారాజ్ మత్రాసి
ప్రొడ్యూసర్ – m.రాజ్ కుమార్
ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని చిత్రబృందం ప్రకటించింది..
మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు..

Your Comments

Most Read Telugu Movie News

Advertisement