రాజు గారి గది2 ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల

Raju Gari Gadhi 2 Censor Finished U/A Oct 13th Release | kevkeka.com
సెన్సార్ పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొన్న "రాజు గారి గది 2"
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల  
 
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ మరియు ఓ.ఎ.కె ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాజు గారి గది 2". ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్, నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఇవాళ సెన్సార్ పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా "రాజుగారి గది 2"ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.  
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. "బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ "రాజుగారి గది"కి సీక్వెల్ గా రూపొందిన "రాజుగారి గది 2" సెన్సార్ పూర్తయ్యింది. హైక్వాలిటీ విఎఫెక్స్, ఆద్యంతం ఆకట్టుకొనే కథాంశం సినిమాకి కీలకమైన అంశాలు. ఓంకార్ సినిమాను సరికొత్తగా ట్రీట్ చేసిన విధానం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొంటుంది. నాగార్జున మెంటలిస్ట్ గా, సమంత ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, అశ్విన్, షకలక శంకర్ ల కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. అక్టోబర్ 13న సినిమా విడుదలకానుంది. తప్పకుండా మొదటిభాగం కంటే పెద్ద హిట్ అవుతుందన్న పూర్తి నమ్మకం మాకుంది" అన్నారు.

Your Comments

Most Read Telugu Movie News

Advertisement