Advertisement

రామోజీ ఫిల్మ్ సిటీ లో... పిల్లలతో సందడి చేసిన హీరో సునీల్

రామోజీ ఫిల్మ్ సిటీ లో... పిల్లలతో సందడి చేసిన హీరో సునీల్ | kevkeka.com

రామోజీ ఫిల్మ్ సిటీ లో... పిల్లలతో సందడి చేసిన హీరో సునీల్

కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల్ని  ఎంటర్ టైన్ చేసి  టాలీవుడ్ హీరోగా సుస్థిర స్తానం సంపాదించుకున్న సునీల్ మరో సారి తన దాతృత్వాన్ని చూపించాడు. తన వంతు గా ఎప్పుడు ఎవరు సాయం అడిగిన వారికి హెల్ప్ చేయడం ఆయన నైజం. అలాంటి సునీల్ అనాథ పిల్లల కోరిక మేరకు... రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి ఎంటర్ టైన్ చేయడం విశేషం. దాదాపు 20 మంది పిల్లల్ని రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి వారిని ఆట పాటల్లో ముంచెత్తారు. సునీల్ ఇచ్చిన సర్ ప్రై స్ కి పిల్లలంతా ఎంజాయ్ చేశారు. తమకు బాగా ఇష్టమైన నటుడితో ఎంజాయ్ చేయడం లైఫ్ లో మర్చిపోలేమన్నారు. స్వచ్ఛమైన మమసున్న పిల్లలతో ఇలా గడపడం... నిజంగా నా అదృష్టమని హీరో సునీల్ ఈ సందర్బంగా ఆనందాన్ని పంచుకున్నారు.

Your Comments