నారా రోహిత్ `బాల‌కృష్ణుడు` షూటింగ్ పూర్తి

Nara Rohith, Pavan Mallela BALAKRISHNUDU Shooting Finished | kevkeka.com
నారా రోహిత్ `బాల‌కృష్ణుడు` షూటింగ్ పూర్తి  
 
స‌ర‌శ్చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `బాల‌కృష్ణుడు`. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ట్రైలర్ మరియు సాంగ్స్ ను ఈనెల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.  
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు బి.మాహేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ.. "నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా `బాల‌కృష్ణుడు` యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. పృథ్వీ, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు కామెడి ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. `న‌ర‌సింహ` చిత్రంలో నీలాంబ‌రిగా, `బాహుబ‌లి` చిత్రంలో శివ‌గామి పాత్ర‌లోమెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం విశేషం. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.   
నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టంట్స్: విజ‌య్‌, కాస్ట్యూమ్స్: న‌ర‌సింహారావ్‌, ఆర్ట్: ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్: మేట్రిక్స్ వి.ఎఫ్‌.ఎక్స్‌, క‌థ‌, మాట‌లు: కొలుసు రాజా, మ్యూజిక్: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి.కుమార్‌, ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లైన్ ప్రొడ్యూస‌ర్: డి.యోగానంద్‌, నిర్మాత‌లు: బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప‌వ‌న్ మ‌ల్లెల‌.

Your Comments