ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 13న జాకీచాన్ `ది ఫారిన‌ర్` విడుదల

ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 13న జాకీచాన్ `ది ఫారిన‌ర్` విడుదల | kevkeka.com
ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 13న జాకీచాన్ `ది ఫారిన‌ర్` విడుదల
 
జాకీ చాన్ తాజాగా న‌టించిన   చిత్రం  `ది ఫారిన‌ర్‌`. మార్టిన్ కాంపెబెల్ ద‌ర్శ‌కుడు.1992లో స్టీఫెన్ లీథ‌ర్ ర‌చించిన `ద చైనామ్యాన్‌` న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.  వ‌ర‌ల్డ్ వైడ్‌గా  తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో  అక్టోబ‌ర్ 13న అత్య‌ధిక థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఖాసీం, ఎమ్. రాజశేఖర్ రెడ్డి సమర్పణలో, నక్షత్ర మీడియా బేన‌ర్ పై నక్షత్ర రాజశేఖర్ సౌత్ ఇండియాలోని అన్ని భాష‌ల్లో ఈ చిత్రాన్ని  విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ...``జాకీ చాన్ న‌టించ‌గా భారీ బ‌డ్జెట్ తో రూపొందిన చిత్ర‌మిది. లండ‌న్ లో హంబుల్ బిజినెస్ మేన్ గా ఎంతో మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఉగ్ర‌వాదుల దాడుల్లో త‌న కూతురు చ‌నిపోవ‌డంతో దీనికి కార‌ణ‌మైన వారంద‌రినీ టార్గెట్ చేసి త‌న రివేంజ్ తీర్చుకోవ‌డ‌మే సినిమా. ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం జాకీ చాన్ చిత్రాల త‌ర‌హాలో ఉంటూ ఆద్యంతం అల‌రిస్తుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్, రిస్కీ ఫైట్స్ ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయి. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లో అక్టోబ‌ర్ 13న  గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం..అన్నారు. 
బ్యానర్: నక్షత్ర మీడియా, సమర్పణ: ఖాసీం, ఎమ్. రాజశేఖర్ రెడ్డి, నిర్మాత: నక్షత్ర రాజశేఖర్, దర్శకత్వం: మార్టిన్ కాంపెబెల్ 

Your Comments