బెల్లంకొండ శ్రీనివాస్-అభిషేక్ పిక్చర్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి !!

Production No 4 Varanasi Schedule Finished | kevkeka.com
వారణాసిలో శ్రీవాస్ - బెల్లంకొండ శ్రీనివాస్-అభిషేక్ పిక్చర్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి !!

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొం శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

ఇటీవలే వారణాసిలో 15 రోజుల యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొన్న ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "ఆ శివుని ఆశీస్సులతో వారణాసి షెడ్యూల్ పూర్తయ్యింది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఈ యాక్షన్ బ్లాక్ ను పిక్చరైజ్ చేశాం. హీరోహీరోయిన్లు బెల్లంకొండ సాయిశ్రీనివాస్-పూజా హెగ్డేలతోపాటు జయప్రకాష్, సూర్య, అశుతోష్ రాణా, పవిత్ర లోకేష్ వంటి ఆర్టిస్టులు కూడా పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కూడా తీశాం. బలమైన కథ-కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.గా శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ మూవీ రూపొందుతోంది. శ్రీవాస్ చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు, తెలుగులో ఇది చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందమంతా కష్టపడి పనిచేస్తోంది" అన్నారు. 

బెల్లంకొండ
 శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

Your Comments