'స్పైడర్‌' మొదటిరోజు కలెక్షన్‌ రూ.51 కోట్లు

Spyder first day collection Rs. 51 Cr | kevkeka.com

సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌' మొదటిరోజు కలెక్షన్‌ రూ.51 కోట్లు 
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. 
ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''భారీ బడ్జెట్‌తో సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో నిర్మించిన 'స్పైడర్‌' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' మొదటిరోజు 51 కోట్లు కలెక్ట్‌ చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత భారీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌గార్లకు మా కృతజ్ఞతలు'' అన్నారు. 

Your Comments

Most Read Telugu Movie News

Advertisement