బోయపాటి మాస్ మార్క్ తో బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్బ్ లుక్ !!

Jaya Janaki Nayaka Releasing on August 11th | kevkeka.com
బోయపాటి మాస్ మార్క్ తో బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్బ్ లుక్ !!
 
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. బోయపాటి సినిమా తరహా మాస్ యాంగిల్ ఎక్కడా కనిపించకుండా.. చాలా క్యూట్ గా ఉన్న ఫస్ట్ లుక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఆ లోటును తీర్చేందుకు నేడు సినిమాలోని బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్న ఈ తాజా పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఎనర్జటిక్ గా మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు. 
ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకొన్న "జయ జానకి నాయక" చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడదగ్గ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "జయ జానకి నాయక" ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.  
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్,  పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!Your Comments

Most Read Telugu Movie News

Advertisement