ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై నాలుగోవారంలో "ఉంగరాల రాంబాబు" విడుద‌ల‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై నాలుగోవారంలో

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై నాలుగోవారంలో "ఉంగరాల రాంబాబు" విడుద‌ల‌

 
 వ‌రుస  క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ లు త‌న సొంతం చేసుకొన్న‌సునీల్ హీరోగా, ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబందించిన మూడు పాట‌లు విడుద‌ల‌య్యి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా మెద‌టి పాట‌లో సునీల్ డాన్స్ లు చూసి మాస్ ఆడియ‌న్స్ విజిల్స్ ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై నాలుగోవారం లో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.



ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు మంచి చిత్రాలుగా తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలోకూడా ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను  అందించబోతున్నాము. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న  క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. ముఖ్యంగా ప్ర‌కాష్‌రాజ్ , పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర లు న‌ట‌న ఈ చిత్రానికి ప్ర‌త్య‌ఖంగా నిలుస్తుంది. ఈచిత్రాన్ని అన్ని కార్క‌క్ర‌మాలు పూర్తిచేసి జులై చివ‌రి వారంలో విడుదల చేస్తాము. ఇప్ప‌టికే బిజినెస్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్విస్తుంద‌ని న‌మ్ముతున్నాం. అని అన్నారు.

నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

సాంకేతిక వర్గం
మ్యూజిక్ - జిబ్రాన్
లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ - వెంకట్
డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి - భాను మాస్టర్
పబ్లిసిటీ - ధని 
పిఆర్ఓ - ఏలూరు శ్రీను, 
                                        బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
                              ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి
                                డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్

Your Comments