33 ఏళ్ల సినీ ప్రస్థానంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి

33 Years for Srinivas Reddy in Film Industry !! | kevkeka.com

33  ఏళ్ల సినీ ప్రస్థానంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి

కామెడీ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్. శ్రీనివాస రెడ్డి 33 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శ్రీ క్రిష్ణా మూవీ మేకర్స్ ఆఫీస్ లో వేడుకలు జరుపుకున్నారు.

1984లో ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు విజ‌యారెడ్డి ద‌గ్గ‌ర అసిస్టెంట్డైరెక్ట‌ర్ గా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌రువాత‌, అంకుశం చిత్రానికిప‌నిచేశారు. వై. నాగేశ్వ‌ర‌రావు, శివ నాగేశ్వ‌ర‌రావు వంటి ప్ర‌ముఖద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర చాలా చిత్రాల‌కు ప‌నిచేశారు.

కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి చూడదగ్గర కామెడీ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆయన సినిమా టైటిల్స్ ఎంపిక దగ్గర నుంచే కామెడీ టచ్ ఉండేలా చూసుకుంటారు. అదిరిందయ్యా చంద్రం చిత్రంతో సూపర్ హిట్ అందుకుని.. ఆ తరువాత, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, కుబేరులు వంటి కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. యమగోల మళ్లీ మొదలైంది చిత్రంతో సోషియో ఫ్యాంటసీ సబ్జెక్టుల్ని కూడా అద్భుతంగా డీల్  చెయ్యగలరని నిరూపించుకున్నారు. తక్కువ బడ్జెట్ లోనే... స్పెషల్ ఎఫెక్ట్స్ మేళవించి తీసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం.

ఆ తరువాత, నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఢమరుకం చిత్రం..అప్పటి వరకూ నాగ్ కెరీర్లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. తెలుగులో గంటకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ సినిమా చేయడం అదే ప్రథమం.

Your Comments

Most Read Telugu Movie News

Advertisement