మే 17న 'రారండోయ్‌.. వేడుక చూద్దాం' 3వ సాంగ్‌ విడుదల

On May 17th Rarandoy Veduka Chooddam 3rd Song Release | kevkeka.com

మే 17న 'రారండోయ్‌.. వేడుక చూద్దాం' 3వ సాంగ్‌ విడుదల 

 

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ట్రైలర్‌తోపాటు ఇటీవల విడుదలైన సాంగ్‌ ప్రోమోస్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌కి 2 మిలియన్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. మే 17 బుధవారం ఉదయం 9.30 గంటలకు 3వ సాంగ్‌ 'భ్రమరాంబ..'ను విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ఆడియోను మే 18న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల. 

Your Comments

Most Read Telugu Movie News

Advertisement