జూన్ లో వీడెవడు?

VEEDEVADU Movie Release On June | kevkeka.com
జూన్ లో వీడెవడు?

సచిన్‌  హీరోగా  భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా ఫేమ్‌ తాతినేని సత్య దర్శకత్వంలో వై కింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థపై రైనా జోషి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వీడెవడు’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో హీరోయిన్‌ను ఎవరు చంపారో తెలుసుకోవాలనే ఆసక్తినీ కలిగించింది. ఈ మర్డర్‌ మిస్టరీ చిక్కుముడి జూన్‌లో వీడనుంది. ఎందుకంటే... ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ – ‘‘సచిన్‌  కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. గాళ్‌ ఫ్రెండ్‌ను చంపాడనే ఆరోపణ మీద పోలీసులు అతణ్ణి అరెస్ట్‌ చేస్తారు. హీరో గాళ్‌ఫ్రెండ్‌ పాత్రలో హిందీ హీరోయిన్‌ ఈషా గుప్తా నటించారు. సినిమాలో సస్పెన్స్‌ అండ్‌ థ్రిల్‌తో పాటు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. జూన్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. 

ప్రభు, కిషోర్, సుప్రీత్, శ్రీనివాస్‌రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, హర్షవర్థన్, ధన్య బాలకృష్ణన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఆర్ట్‌: కులకర్ణి, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, కొరియోగ్రఫీ: సీజర్, జానీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శివప్రసాద్‌ గుడిమిట్ల, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, నిర్మాత: రైనా జోషి, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: తాతినేని సత్య. 

Your Comments

Most Read Telugu Movie News

Advertisement