మే 12న వ‌స్తున్న `ఓ పిల్లా నీ వ‌ల్లా`

O Pilla Nee Valla Releasing On May 12th | kevkeka.com
మే 12న వ‌స్తున్న `ఓ పిల్లా నీ వ‌ల్లా`

 
కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్‌విగ్‌ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`.  కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ట్రైల‌ర్‌ని క్రేజీ హీరో శ‌ర్వానంద్ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లు బావున్నాయంటూ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా కామ‌న్ జ‌నాల నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లొచ్చాయి. అలాగే ఇటీవ‌ల రిలీజైన ఆడియో శ్రోత‌ల్ని మెప్పించింది. ట్రైల‌ర్ చూశాక మేకింగ్ ప‌రంగా ద‌ర్శ‌కుని ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మే 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. 


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రం. ల‌వ్‌, కామెడీ, యాక్ష‌న్ హైలైట్‌గా ఉంటాయి. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లు స‌హా ఆడియోకి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకునే చిత్ర‌మిది. మే 12న సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.

Your Comments

Most Read Telugu Movie News

Advertisement