మళ్లీ వస్తున్న 'మన్యంపులి'

Manyam Puli Re Release | kevkeka.com

మళ్లీ వస్తున్న 'మన్యంపులి'


శ్రీ
 సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై గతేడాది డిసెంబర్ 2న విడుదలై సూపర్ హిట్ మూవీ మన్యంపులి, ప్రేక్షకుల కోరిక పై మళ్లీ విడుదలకు సిద్ధమైంది. గతంలో మన్యంపులి విడుదలైన సమయంలో నోట్లు రద్దు ప్రభావంతో చాలా మంది ప్రేక్షకులు ఈ విజువల్ వండర్ ని చూడలేకపోయారు, వారిందరి కోసమే మన్యంపులిని ఈ మే 6న సెకండ్ రిలీజ్ చేసేందుకు శ్రీ సరస్వతి ఫిలిమ్స్ వారు సిద్ధమవుతున్నారు. బాహుబలి ది కంక్లూజన్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో మన్యంపులిలో థ్రిలింగ్ ఫైట్స్, పులి వేటకి సంబంధించిన విజువల్స్ మళ్లీ మళ్లీ చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపుతారనే నమ్మకంతోనే ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలిపారు. అలానే భారీ స్థాయిలో ఎగ్జీబిటర్స్ కూడా మన్యంపులి సెకండ్ రిలీజ్ కు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక ఇదే బ్యానర్ నుంచి మరో విజువల్ ఫీస్ట్ 'ఏంజెల్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరి అంతకంటే ముందుగా వేసవి బరిలోకి దిగుతోంది మన్యంపులి. మరి ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ మళ్లీ ఏ రేంజ్ సక్సెస్ అందిచస్తారో చూడాలి. ఇక పెద్దలతో పాటు చిన్నపిల్లల్ని కూడా అలరించేలా రూపొందిన ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్

Your Comments

Most Read Telugu Movie News

Advertisement