ఆచారి అమెరికా యాత్ర" రెగ్యులర్ షూటింగ్ మొదలు!!

Achari America Yatra Regular Shooting From May 5th | kevkeka.com

మే 5 నుంచి "ఆచారి అమెరికా యాత్ర" రెగ్యులర్ షూటింగ్ మొదలు!!


మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". 
"దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రమిది. పద్మశ్రీ డా.మోహన్ బాబు జన్మదినం సందర్భంగా మార్చి 19న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 5 నుంచి ప్రారంభంకానుంది. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "మంచు విష్ణు సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసాం. మే 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం అమెరికా షెడ్యూల్ ప్రారంభమవుతుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రానికి మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హైలైట్ గా నిలుస్తుంది" అన్నారు.
విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: సెల్వ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

Your Comments

Most Read Telugu Movie News

Advertisement