లేడీ ఓరియంటెడ్‌ చిత్రం వోడ్కా

లేడీ ఓరియంటెడ్‌ చిత్రం వోడ్కా | kevkeka.com

లేడీ ఓరియంటెడ్‌ చిత్రం వోడ్కా


'వోడ్కా' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎల్‌ సెవెన్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న 'వోడ్కా' (వాయిస్‌ ఆఫ్‌ గర్ల్‌) అనేది ఉప శీర్షిక. షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. లోరా అమ్ము ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీవి, ప్రమోద్‌చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధా, సూర్యతేజ ఇతర పాత్రధారులు. లోగడ 'ఓల్డ్‌సిటీ' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సలీం మాలిక్‌ దర్శకత్వంలో లోరా అమ్ము ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్‌ ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓల్డ్‌సిటీ సలీం మాలిక్‌ మాట్లాడుతూ ''వోడ్కా వైవిధ్యం ఉన్న చిత్రం. చలన చిత్ర చరిత్రలోనే ఇలాంటి భిన్నమైన సినిమా తొలిసారి నిర్మాణమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్‌ సినిమా'' అని చెప్పారు. 
నిర్మాత లోరా అమ్ము మాట్లాడుతూ '' హైదరాబాద్‌లో టాకీపార్ట్‌ చిత్రీకరణ జరిపిన అనంతరం పాటలను వైజాగ్‌, అరకు లొకేషన్లలో చిత్రీకరిస్తాం. మంచి చిత్రాలను అందించాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను'' అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ: రాజశేఖర్‌ సలాది (యాష్‌), ఛాయాగ్రహణం: శివకృష్ణ. వై, సంగీతం: నందన్‌ రాజ్‌.

Your Comments

Most Read Telugu Movie News

Advertisement