అన్నీ తానై పవన్ కళ్యాణ్

janasena party website | jana sena website | pawan kalyan jana sena website

రాజకీయ కదనరంగంలోకి పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే బర్నింగ్ టాపిక్. ప్రతి ఒక్కరూ పవన్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు.ఆల్రెడీ పార్టీ పేరు జనసేన అని ఒక క్లారిటీ రావడంతో ఇక ఇప్పుడు పవన్ పార్టీ జెండా, ఎజెండా, విధి విధానాలు, అసలు పవన్ అభ్యర్దులు పోటీ లోకి దిగుతారా, దిగితే ఎంత మంది, ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తారు, ఇలా అభిమానుల్లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి .

అయితే వీటన్నిటికీ పవన్ రేపు సమాధానాలు చెబుతూ తన రాజకీయ ఎంట్రీపై ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయబోతున్నాడు. అయితే తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ‘జనసేన పార్టీ’ పేరు మీద పవన్ ఆల్రెడీ ఒక అఫిషీయల్ వెబ్‌సైట్‌ను కూడా రెడీ చేసుకున్నారు.

జన సేన.ఇన్ పేరుతో ఉన్న పార్టీ వెబ్ సైట్ స్వయంగా కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీదనే రిజిస్టర్ అయ్యి ఉండడం విశేషం. అంతేకాక అందులో పవన్ జూబ్లీ హిల్స్ పూర్తీ అడ్రస్ కూడా నమోదు చెయ్యడం విశేషం. దీనికి సంబందించిన ఆధారాలను ఎక్స్ క్లూజివుగా మా కెవ్ కేక రీడర్స్ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పవన్ అన్నీ తానై జనసేనను ముందుకు తీసుకు పోతున్నాడని. 

Your Comments

Most Read Telugu Movie News

Advertisement